Enquire Now
Enquire Apply

మానసిక ఆరోగ్యం సమాజ శ్రేయస్సుకు పునాది

పత్రికా ప్రకటన ఏఐఎంఎస్ఆర్, చిత్తూరు తేదీ: 09 అక్టోబర్ 2025 మానసిక ఆరోగ్యం సమాజ శ్రేయస్సుకు పునాది ఆపోలో వర్శిటీ వీసీ డా. హెచ్. వినోద్భట్ _ ఎఐఎంఎస్ఆర్లో ఘనంగా మానసిక ఆరోగ్య వారోత్సవ వేడుకలు చిత్తూరు, అక్టోబర్ 9: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (AIMSR)లో సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. “కాటాస్ట్రోఫీలు, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవల ప్రాముఖ్యతఅనే థీమ్తో జరిగిన కార్యక్రమాలకు ది అపోలో యూనివర్శిటీ వైస్చాన్సలర్డాక్టర్హెచ్. వినోద్భట్, AIMSR డీన్డాక్టర్ఆల్ఫ్రెడ్జె. ఆగస్టైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వైస్చాన్సలర్డాక్టర్హెచ్. వినోద్భట్మాట్లాడుతూ, “మానసిక అనారోగ్యం అనేది ఎంతో క్లిష్టమైనది. బాధితుల దగ్గర వారు కూడా దాన్ని గుర్తించడంలో విఫలమవుతుంటారు. మానసిక ఆరోగ్యం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు, అది కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని కాపాడుకోవాలి. వైద్య రంగంలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవలు అందించగల నిపుణులను సిద్ధం చేయడం సమాజానికి అత్యవసరంఅని అన్నారు. సందర్భంగా పోస్టర్ ప్రదర్శనలు, వ్యాసరచన, నినాద రచన, డిబేట్, స్కిట్ ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రంలో అసోసియేట్డీన్డాక్టర్రమ్యా రామకృష్ణన్, సైకియాట్రి విభాగం ప్రొఫెసర్డాక్టర్దినేష్. పి, సీనియర్ప్రొఫెసర్డాక్టర్భాస్కర్నాయుడు, అధ్యాపకులు, స్కూల్ఆఫ్హెల్త్సైన్సెస్, మెడికల్, పారా మెడికల్అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ———————– డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనిర్శిటీ & AIMSR చిత్తూరు.