Enquire Now
Enquire Apply

శరీరం–మనసు సమతుల్యతే నిజమైన ఆరోగ్యం

పత్రికా ప్రకటన   ది అపోలో యూనివర్శిటీచిత్తూరు తేదీ: 15-10-2025 శరీరంమనసు సమతుల్యతే నిజమైన ఆరోగ్యం చిత్తూరు, అక్టోబర్ 15: ది అపోలో యూనివర్శిటీ యోగా అండ్ మెడిటేషన్ క్లబ్ఆధ్వర్యంలోవరల్డ్ మెంటల్ హెల్త్ డేసందర్భంగా బుధవారంఆబ్జర్వెన్స్ డేకార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్సేతురామ సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, మానసిక ప్రశాంతత, మంచి అలవాట్లు, సమతుల ఆలోచనలు మన ఆరోగ్యానికి మూలస్తంభాలు అని చెప్పారు. రిసోర్స్ పర్సన్, హార్ట్ఫుల్నెస్మెడిటేషన్ఫెసిలిటేటర్, సీటామ్స్అసోసియేట్ ప్రొఫెసర్హంసవేణి యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను మరియు శరీరంమనసు సమతుల్యతను ఎలా సాధించవచ్చో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవనశైలిలో యోగా, ధ్యానం వంటి సాధనాలు మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమని, ప్రతిరోజూ కొన్ని నిమిషాల ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళనల నుండి బయటపడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో యోగా అండ్ మెడిటేషన్క్లబ్ఫ్యాకల్టీ కోఆర్డినేటర్, అసిస్టెంట్డీన్డాక్టర్కవిత ఎస్, డైరెక్టరేట్ఆఫ్ప్రెస్అండ్ పబ్లికేషన్స్అసిస్టెంట్డైరెక్టర్డాక్టర్కీర్తనా థాంకచన్, విద్యార్థులు, అధ్యాపకులు, యోగా క్లబ్సభ్యులు పాల్గొన్నారు. ————————————– ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ విభాగం ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు