Enquire Now
Enquire Apply

ప్రతి వ్యక్తికి ఆరోగ్యం మొదటి ప్రాధాన్యం కావాలి

ప్రెస్ నోట్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు తేదీః 12 డిసెంబర్2025 ప్రతి వ్యక్తికి ఆరోగ్యం మొదటి ప్రాధాన్యం కావాలి ది అపోలో యూనివర్శిటీ రిజిస్ట్రార్పొ. ఎం. పోతరాజు చిత్తూరు, డిసెంబర్ 12: యూనివర్సల్ హెల్త్కవరేజ్డేను పురస్కరించుకుని ది అపోలో యూనివర్శిటీ స్కూల్ఆఫ్మేనేజ్మెంట్శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, ఆరోగ్య అవగాహన, వైద్య సేవల అందుబాటు వంటి అంశాలపై దృష్టి సారించిన కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు విలువైన సూచనలు అందించారు. సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు మాట్లాడుతూ, “ప్రతి వ్యక్తి ముందుగా తన ఆరోగ్యానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముందస్తు జాగ్రత్తలు ఎంతో కీలకంఅని అన్నారు. అలాగే హెల్త్ సర్వీసులు, ఇన్సూరెన్స్ పాలసీ వంటి అంశాలపై ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. ఆరోగ్య రంగంలోని సమగ్ర జ్ఞానాన్ని అందించడంలో అపోలో గ్రూప్సరైన వేదికగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. హెల్త్కేర్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఫీల్డ్లోకి అడుగుపెడుతున్న విద్యార్థులు సేవాభావంతో సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించాలని రిజిస్ట్రార్ సూచించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ రామయ్య ఇటుమల్ల యూనివర్సల్ హెల్త్కవరేజ్ప్రాధాన్యతను వివరించారు. ప్రతి వ్యక్తికి నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, బాధ్యత ప్రభుత్వాలు మరియు ఆరోగ్య సంస్థలపైన ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య సేవల్లో సమాన హక్కు, ఆర్థిక భద్రత, బలమైన వైద్య వ్యవస్థలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్డాక్టర్కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ——————————– డైరెక్టరేట్ఆఫ్ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు