నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయిస్తాయి: విసి డా. హెచ్. వినోద్ భట్
పత్రికా ప్రకటన
ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు
తేదీ: 26 నవంబర్ 2025
నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయిస్తాయి: విసి డా. హెచ్. వినోద్ భట్
అపోలో యూనివర్సిటీలో ఐబీఎం–ఇండస్ట్రీ లెర్నింగ్ నెట్వర్క్ శిక్షణ ప్రారంభం
చిత్తూరు, నవంబర్ 26: ది అపోలో యూనివర్సిటీలో బుధవారం ఐబీఎం–ఇండస్ట్రీ లెర్నింగ్ నెట్వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని విశేషంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ… వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తాయని స్పష్టం చేశారు.
కేవలం డిగ్రీలు సరిపోవని, ప్రాక్టికల్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, పరిశ్రమలకు సరిపోయే ఆధునిక స్కిల్స్ ప్రతి విద్యార్థి లో పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఐబీఎం వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు విద్యా రంగం–పరిశ్రమల మధ్య కీలక వంతెనగా నిలుస్తూ, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల నైపుణ్యాలను అందిస్తున్నాయని వైస్ ఛాన్సలర్ అభినందించారు. ప్రస్తుతం అనేక ఐటీ సంస్థలు క్యాంపస్ నియామకాలను తగ్గిస్తున్నప్పటికీ, కృత్రిమ మేధస్సు మరియు ఆధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని పేర్కొన్నారు. అపోలో యూనివర్సిటీ విద్యార్థులు ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను సాధిస్తారన్న నమ్మకం ఉన్నట్లు డా. వినోద్ భట్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డా. జే. జగదీశన్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డా. రామయ్య ఇతుమల్ల, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సేతురామ సుబ్బయ్య, ప్రత్యేక అతిథి డాక్టర్ దినకర్‌రెడ్డి ఎస్, ఐసిటి అకాడమీ టెక్నికల్ ట్రైనర్ పవన్‌కుమార్, ఫ్యాకల్జీ కో-ఆర్డినేటర్లు డా. ఏ.బి. మంజు, డా. సంగీత ఎస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ శిక్షణలో డేటా అనలిటిక్స్, ఐటీ టూల్స్, రియల్‌టైమ్ సమస్య పరిష్కారం, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం వంటి కీలక అంశాల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించనున్నారు.
————————
డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్
ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు.