Enquire Now
Enquire Apply

ఘనంగా ముగిసిన అపోలో స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు

పత్రికా ప్రకటన అపోలో నాలెడ్జ్ సిటీ, చిత్తూరు తేదీ: 04 అక్టోబర్2025 ఘనంగా ముగిసిన అపోలో స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు పది రోజుల పాటు కొనసాగిన ప్రత్యేక క్లీన్లీనెస్ క్యాంపెయిన్ స్వచ్ఛత అంటే శుభ్రత మాత్రమే కాదుజీవన విలువ అని చాటిన విద్యార్థులు చిత్తూరు, అక్టోబర్4: చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్సిటీలో పది రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛతే సేవా ప్రత్యేక క్యాంపెయిన్శనివారం ఘనంగా ముగిసింది. ది అపోలో యూనివర్శిటీ, అపోలో ఇన్స్టిట్యూట్ఆఫ్మెడికల్సైన్సెస్అండ్రీసెర్చ్(AIMSR), అపోలో కాలేజ్ఆఫ్నర్సింగ్సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. సందర్భంగా డా. ప్రసాద్సి. రెడ్డి నాలెడ్జ్సెంటర్ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది అపోలో యూనివర్శిటీ వైస్ఛాన్సలర్డా. హెచ్. వినోద్భట్హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ – “పది రోజుల పాటు క్యాంపస్అంతటా జరిగిన స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు సమగ్రత, విజిబిలిటీతో చాలా బాగా జరిగాయి. పర్యావరణం పట్ల మనం చూపించే శ్రద్ధకు ప్రతిస్పందనగా ప్రకృతీ అదే విధంగా మనపై ప్రభావం చూపుతుంది. స్వచ్ఛతే సేవా కార్యక్రమం ఒక్క సంవత్సరం కార్యక్రమం కాకుండా, ప్రతిరోజూ మన జీవిత భాగంగా మారాలి,” అని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ప్రొ. ఎం. పోతరాజు మరియు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ల మార్గదర్శకత్వంలో సెప్టెంబర్24 నుండి అక్టోబర్3 వరకు సాగిన క్యాంపెయిన్లో హాస్టల్క్లీన్లీనెస్వీక్, డిజిటల్క్లీన్డ్రైవ్, వీడ్కలెక్షన్, ప్లాంటేషన్డ్రైవ్, క్లీన్గ్రీన్ఉత్సవ్, హౌస్కీపింగ్సిబ్బందికి హెల్త్చెకప్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా డ్రైవ్వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. డ్రామా క్లబ్విద్యార్థులు ప్రదర్శించినస్వచ్ఛతప్రతి ఒక్కరి బాధ్యతఅనే స్కిట్అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ది అపోలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ప్రొ. ఎం. పోతరాజు, ఎఐఎంఎస్ఆర్డీన్డా. అల్ఫ్రెడ్జె. అగస్టిన్, ఎన్ఎస్ఎస్కోఆర్డినేటర్లు హేంమాద్రి రెడ్డి, గాయత్రి, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ————————— డైరెక్టరేట్ఆఫ్ప్రెస్అండ్పబ్లికేషన్స్, ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు.