Enquire Now
Enquire Apply

– అపోలో వర్సిటీ వీసీ డా. హెచ్‌. వినోద్‌ భట్‌

పత్రికా ప్రకటన   ది అపోలో యూనిర్శిటీ, చిత్తూరు తేదీ: 13 అక్టోబర్ 2025 మానసిక ఆరోగ్యానికి హిప్నోథెరపీ అవసరంఅపోలో వర్సిటీ వీసీ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ చిత్తూరు, అక్టోబర్‌ 13ః మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి శాస్త్రీయ పద్ధతులైన హిప్నోథెరపీ వంటి థెరపీలు కీలకమని ది అపోలో యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ అన్నారు. చిత్తూరు మురకంబట్టు సాకేతలోని ది అపోలో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ – సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల “అడ్వాన్స్‌డ్‌ లెవల్‌ ఆఫ్‌ క్లినికల్‌ హిప్నోథెరపీ” జాతీయ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ — “నేటి వేగవంతమైన జీవనశైలిలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యం మరింత పెరిగింది. హిప్నోథెరపీ మానసిక ఒత్తిడి, భయాలు, ఆందోళనలను తగ్గించడంలో, వ్యక్తిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో సహకరిస్తుంది” అన్నారు.వైద్య రంగంలో సైకాలజీ అనేది అత్యంత కీలకం. ఆపరేషన్‌ ముందు రోగికి మనోధైర్యం కల్పించడం, విశ్వాసాన్ని పెంచడం వంటి అంశాల్లో కౌన్సెలింగ్‌ పాత్ర విశేషం. సైకాలజీ విభాగంలో పరిశోధనలు పెరగాలి. సైన్స్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ నైపుణ్యాల అభివృద్ధికి అపోలో యూనివర్సిటీ అగ్రగామిగా ముందుకు సాగుతోంది” అని డా. భట్‌ పేర్కొన్నారు. సేలం పెరియార్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎస్‌. ఖదిరవన్‌ రిసోర్స్‌ పర్సన్‌గా పాల్గొని హిప్నోథెరపీ సాంకేతికతలు, నైతిక అంశాలపై అవగాహన కల్పించారు. వర్క్‌షాప్‌లో వర్శిటీ సైకాలజీ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ భాస్కర్‌నాయుడు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ విజయ్‌, వివిధ యూనివర్శిటీల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ————————— డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు.