Enquire Now
Enquire Apply

రాజ్‌భవన్‌లో అవార్డును స్వీకరించిన డి. రెడ్డి జీశ్ణు

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్శిటీ – చిత్తూరు తేదీ: 06 అక్టోబర్‌ 2025 అపోలో విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు రాజ్‌భవన్‌లో అవార్డును స్వీకరించిన డి. రెడ్డి జీశ్ణు చిత్తూరు, అక్టోబర్‌ 6: ది అపోలో యూనివర్శిటీ విద్యార్థి డి. రెడ్డి జీశ్ణు దేశస్థాయిలో అరుదైన గౌరవాన్ని సాధించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) 2022–23 సంవత్సరానికి గాను వాలంటీర్‌ విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం స్వీకరించారు. జీశ్ణు ది అపోలో యనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబిఏ ద్వితియ సంవత్సరం చదువుతున్నారు. యూనిర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగంలో వాలంటీర్గా ఉన్న ఆయన సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. ఆరోగ్య అవగాహన, పర్యావరణ సంరక్షణ, రక్తదానం, గ్రామాల్లో శుభ్రతా కార్యక్రమాలు, మహిళా శ్రేయస్సు వంటి రంగాల్లో విశేషంగా సేవలందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలలో మాసిక పరిశుభ్రతపై అవగాహన కల్పించి, అవసరమైన ప్యాడ్లను పంపిణీ చేశారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థుల విద్యా ఫీజులు చెల్లించి సాయం చేశారు. చిత్తూరు పట్టణంలో వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టి, విద్యుత్‌ మరియు ఇంధన పొదుపుపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఇప్పటివరకు ఆయన 11 వేల 130 మొక్కలను నాటడంతో పాటు, పలు రక్తదాన శిబిరాలను నిర్వహించి 21 సార్లు రక్తదానం చేశారు. సామాజిక సేవలో చూపిన అంకితభావానికి గుర్తింపుగా, జీశ్ణుకు గతంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ జాతీయ సేవా పథకం వాలంటీర్‌ పురస్కారం కూడా లభించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎన్‌.ఎస్‌.ఎస్‌ వాలంటీర్లలో అత్యుత్తమ సేవలందించిన కొద్దిమందిని మాత్రమే ఈ జాతీయ గౌరవానికి ఎంపిక చేస్తారు. జీశ్ణు రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకోవడం యూనివర్శిటీకి గర్వకారణమని, ఆయన కృషి విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకమని ది అపోలో యూనిర్శిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ హెచ్‌. వినోద్‌భట్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. పోతరాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ హేమాద్రిరెడ్డి అభినందించారు. ఈ అవార్డు ది అపోలో యూనివర్శిటీని మరోసారి జాతీయస్థాయిలో తమ సామాజిక బాధ్యత, సేవా భావం, యువతకు ఇచ్చే ప్రేరణకు ప్రతిష్ఠాత్మకంగా నిలిపింది. —————————–