Enquire Now
Enquire Apply

ఫ్లవర్ గార్డెన్‌లో మొక్కలు నాటిన విద్యార్థులు

పత్రికా ప్రకటన   ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు తేదీ: 06 డిసెంబర్ 2025 అపోలోలో వరల్డ్ సాయిల్ డే ఫ్లవర్ గార్డెన్లో మొక్కలు నాటిన విద్యార్థులు చిత్తూరు, డిసెం.6: వరల్డ్సాయిల్డేను పురస్కరించుకుని ది అపోలో యూనివర్శిటీ క్యాంపస్లో శనివారం మొక్కలు నాటారు. అపోలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాంటేషన్కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని ఫ్రవర్గార్డెన్తో పాటు వివిధ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో పూల మొక్కలను నాటారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి పూల మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండాలని, క్యాంపస్లో పచ్చదనాన్ని విస్తరించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని ఆయన అన్నారు. ఎకో క్లబ్విద్యార్థులు కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకుని ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఫ్లవర్గార్డెన్, మేరిగోల్డ్గార్డెన్ప్రాంతాల్లో విద్యార్థుల సందడి నెలకొంది. పూల మొక్కలను పెద్ద సంఖ్యలో నాటి ప్రాంగణాన్ని హరితవనంలా మార్చారు. గుంతలు త్రవ్వడం నుంచి నీరు పోయడం వరకు ప్రతి పనిలోనూ పాల్గొని పర్యావరణ పరిరక్షణలో తమ పాత్రను నిరూపించారు. పచ్చదనం పెరుగుదల క్యాంపస్వాతావరణాన్ని శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో ఎంత కీలకమో డ్రైవ్ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అపోలో ఎకో క్లబ్కోఆర్డినేటర్డాక్టర్ఎస్. ఫిరోజ్బేగం పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై ప్లాంటేషన్డ్రైవ్ను విజయవంతం చేశారు. ——————————– డైరెక్టరేట్ఆఫ్ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు