ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ్రత, పచ్చదనం
పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు
తేదీ : 03 అక్టోబర్ 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ్రత, పచ్చదనం
అపోలో విద్యార్థుల స్వచ్ఛతే సేవ కార్యక్రమం
చిత్తూరు, అక్టోబర్ 3: స్వచ్ఛతే సేవా కార్యక్రమాల భాగంగా ది అపోలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో క్లీనింగ్ & ప్లాంటేషన్ డ్రైవ్ శుక్రవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతురాజు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ది అపోలో యూనివర్సిటీ, అపోలో నర్సింగ్ కాలేజ్‌కి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే ఉత్సాహంగా పాల్గొన్న వాలంటీర్లు ఆసుపత్రి పరిసరాల్లో చెత్తను, కలుపు మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. ఆ తర్వాత పర్యావరణ సౌందర్యాన్ని పెంచే లక్ష్యంతో పలు కరాల మొక్కలు నాటారు.
విద్యార్థులు సమాజానికి సేవ చేయాలనే భావంతో ముందుకు వచ్చి, ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రతను కాపాడే దిశగా కృషి చేశారు. ఒకే రోజు 100 మందికి పైగా వాలంటీర్లు వివిధ విభాగాల నుండి సమిష్టిగా పాల్గొన్నారు. వారిచే చేపట్టిన శుభ్రతా పనులు ఆసుపత్రి వాతావరణాన్ని మార్చేసి, రోగులు, బంధువులు, స్థానికులకు ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించాయి.
ఈ సందర్భంగా వాలంటీర్లు “స్వచ్ఛమైన పరిసరాలే ఆరోగ్యానికి బాట” అని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హేమాద్రిరెడ్డి, నర్సింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ లీలావతి, ఎఐఎంఎస్ఆర్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ హేమంత్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
——————–
డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ ,
ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు.