Enquire Now
Enquire Apply

నాణ్యమైన పరిశోధనలే యూనివర్శిటీ ప్రతిష్టకు ప్రాణం

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు తేదీ: 10 అక్టోబర్ 2025 నాణ్యమైన పరిశోధనలే యూనివర్శిటీ ప్రతిష్టకు ప్రాణం – అపోలో వర్శిటీ వీసీ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ చిత్తూరు, అక్టోబర్‌ 10: చిత్తూరు మురకంబట్టులోని ది అపోలో యూనివర్శిటీలో శుక్రవారం “రైట్ ఇట్ రైట్ – రోడ్ మ్యాప్ ఫర్ అకాడమిక్ రైటింగ్” అనే అంశంపై ఒక రోజు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (FDP) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లోని అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం, డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్‌ సంయుక్తంగా డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి నాలెడ్జ్ సెంటర్‌ ఆడిటోరియంలో నిర్వహించాయి. ది అపోలో యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ – “విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠకు పరిశోధనల నాణ్యతే ప్రాణం. ప్రతీ ఫ్యాకల్టీ, రీసెర్చ్‌ స్కాలర్‌ పరిశోధనలో క్వాలిటీ, నైతిక విలువలు పాటించడం అత్యంత అవసరం. కొత్త రీసెర్చ్‌ పాలసీ అమలుతో అపోలో యూనివర్శిటీ రీసెర్చ్‌ రంగంలో విశేష పురోగతిని సాధిస్తోంది. అకాడమిక్‌ రైటింగ్‌ అనేది పరిశోధనలో మూలాధారం – పత్రాలు పబ్లిషింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా రాయగలిగితేనే పరిశోధనకు గుర్తింపు లభిస్తుంది,” అన్నారు. డా. భట్‌ ఈ సందర్భంగా ఇటీవల పత్రికల్లో పబ్లిష్‌ అయిన అపోలో యూనివర్శిటీ ప్రొఫెసర్లు డా. రామయ్య ఇటుమల్ల, డా. సత్యనారాయణ రచించిన పరిశోధనా వ్యాసాలను ప్రశంసించి, వారిని అభినందించారు. ప్రధాన వక్తలుగా న్యూరాసిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో డా. రమేష్‌.ఎస్‌.వి., ఆప్టో రీసెర్చ్‌ అకాడమీ వ్యవస్థాపకుడు డా. గోపినాథ్‌ మాధేశ్వరన్‌ పాల్గొని, పరిశోధనా పత్రాల రచన, సరైన జర్నల్‌ ఎంపిక, సమర్థవంతమైన రైటింగ్‌ స్ట్రాటజీలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ప్రచురణా నైతికతలపై విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ – రీసెర్చ్‌ డా. ఉషా అడిగా, స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె. భాస్కర్‌రెడ్డి, అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ హెచ్‌.ఓ.డీ డా. సుచరిత పి, వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. ————————— డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు