Enquire Now
Enquire Apply

నాణ్యమైన పరిశోధనలే యూనివర్శిటీ ప్రతిష్టకు ప్రాణం

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు తేదీ: 10 అక్టోబర్ 2025 నాణ్యమైన పరిశోధనలే యూనివర్శిటీ ప్రతిష్టకు ప్రాణం అపోలో వర్శిటీ వీసీ డా. హెచ్. వినోద్భట్ చిత్తూరు, అక్టోబర్10: చిత్తూరు మురకంబట్టులోని ది అపోలో యూనివర్శిటీలో శుక్రవారంరైట్ ఇట్ రైట్రోడ్ మ్యాప్ ఫర్ అకాడమిక్ రైటింగ్అనే అంశంపై ఒక రోజు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (FDP) నిర్వహించారు. కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోని అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం, డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్సంయుక్తంగా డాక్టర్ప్రతాప్సి. రెడ్డి నాలెడ్జ్ సెంటర్ఆడిటోరియంలో నిర్వహించాయి. ది అపోలో యూనివర్శిటీ వైస్చాన్సలర్డా. హెచ్. వినోద్భట్కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ – “విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠకు పరిశోధనల నాణ్యతే ప్రాణం. ప్రతీ ఫ్యాకల్టీ, రీసెర్చ్స్కాలర్పరిశోధనలో క్వాలిటీ, నైతిక విలువలు పాటించడం అత్యంత అవసరం. కొత్త రీసెర్చ్పాలసీ అమలుతో అపోలో యూనివర్శిటీ రీసెర్చ్రంగంలో విశేష పురోగతిని సాధిస్తోంది. అకాడమిక్రైటింగ్అనేది పరిశోధనలో మూలాధారంపత్రాలు పబ్లిషింగ్ప్రమాణాలకు అనుగుణంగా రాయగలిగితేనే పరిశోధనకు గుర్తింపు లభిస్తుంది,” అన్నారు. డా. భట్ సందర్భంగా ఇటీవల పత్రికల్లో పబ్లిష్అయిన అపోలో యూనివర్శిటీ ప్రొఫెసర్లు డా. రామయ్య ఇటుమల్ల, డా. సత్యనారాయణ రచించిన పరిశోధనా వ్యాసాలను ప్రశంసించి, వారిని అభినందించారు. ప్రధాన వక్తలుగా న్యూరాసిమ్ప్రైవేట్లిమిటెడ్సీఈవో డా. రమేష్.ఎస్.వి., ఆప్టో రీసెర్చ్అకాడమీ వ్యవస్థాపకుడు డా. గోపినాథ్మాధేశ్వరన్పాల్గొని, పరిశోధనా పత్రాల రచన, సరైన జర్నల్ఎంపిక, సమర్థవంతమైన రైటింగ్స్ట్రాటజీలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ప్రచురణా నైతికతలపై విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ – రీసెర్చ్డా. ఉషా అడిగా, స్కూల్ఆఫ్హెల్త్సైన్సెస్డీన్ప్రొఫెసర్కె. భాస్కర్రెడ్డి, అలైడ్హెల్త్సైన్సెస్హెచ్..డీ డా. సుచరిత పి, వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. ————————— డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు