Enquire Now
Enquire Apply

అపోలో విద్యార్థుల స్వచ్ఛతే సేవా – ఫ్లాష్ మాబ్‌

పత్రికా ప్రకటన ది ఆపోలో యూనిర్శిటీ, చిత్తూరు తేదీః 01 అక్టోబర్‌ 2025 అపోలో విద్యార్థుల స్వచ్ఛతే సేవా – ఫ్లాష్ మాబ్‌ శుభ్రతే ఆరోగ్యానికి బాట… సందేశం ఇచ్చిన విద్యార్థులు చిత్తూరు, అక్టోబర్ 1ః స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా అపోలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం చిత్తూరులోని గంగినేని చెరువు చిల్డ్రన్స్ పార్క్ లో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, డ్యాన్స్‌ క్లబ్‌ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లో స్వచ్ఛత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పాటలు, నృత్యాలు, సృజనాత్మక ప్రదర్శనల రూపంలో వాలంటీర్లు, విద్యార్థులు మన పరిసరాలు మన చేతుల్లోనే.. శుభ్రంగా ఉంచుకోవాలి” అనే సందేశాన్ని అందించారు. ప్రజల్లో ఉత్సాహం కలిగించే విధంగా రూపొందించిన ఈ ఫ్లాష్ మాబ్ స్థానికుల దృష్టిని ఆకర్షించింది. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా వీక్షించారు. “శుభ్రతే ఆరోగ్యానికి బాట” అనే నినాదాన్ని ప్రతిధ్వనింపజేసిన విద్యార్థులు సమాజంలోని ప్రతి ఒక్కరూ శుభ్రతా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతా సందేశంను సృజనాత్మకంగా అందించిన ఈ ఫ్లాష్ మాబ్ స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు డేనియల్ వీ, భాగ్యశ్రీ మిశ్రా, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏ. గాయత్రి, విద్యార్థులు పాల్గొన్నారు. ఘనంగా ఆయుధ పూజ దసరా వేడుకలలో భాగంగా అపోలో నాలెడ్జ్ సిటీ క్యాంపస్‌లో ఆయుధ పూజ బుధవారం ఘనంగా నిర్వహించారు. AIMSR అడ్మిన్‌ బ్లాక్‌ మెయిన్‌ లాబీలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ఉపయోగించే పరికరాలు, వాహనాలు, కార్యాలయ సామగ్రిని సంప్రదాయబద్ధంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూజా కార్యక్రమం భక్తి, ఆనంద వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ది అపోటో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ డాక్టర్‌ హెచ్. వినోద్‌ భట్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. పోతరాజు, ఎఐఎంఎస్‌ఆర్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ రమ్యా రామకృష్ణన్‌, స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.