Enquire Now
Enquire Apply

అపోలో నాలెడ్జ్‌ సిటీలో ప్రీ–క్రిస్మస్‌ వేడుకలు

పత్రికా ప్రకటన అపోలో నాలెడ్జ్సిటీ, చిత్తూరు తేదీః 19 డిసెంబర్2025 అపోలో నాలెడ్జ్సిటీలో ప్రీక్రిస్మస్వేడుకలు చిత్తూరు, డిసెంబర్19 అపోలో నాలెడ్జ్సిటీ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం ప్రీక్రిస్మస్వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. క్రిస్మస్సందడి ప్రతిబింబించేలా క్యాంపస్ను ఆకర్షణీయంగా అలంకరించారు. దీపాలు, క్రిస్మస్ఆటపాటలతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. సంగీతం, క్యారల్స్తో క్యాంపస్అంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. వేడుకలకు ది అపోలో యూనివర్సిటీ వైస్‌–ఛాన్సలర్డా. హెచ్. వినోద్భట్ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్పండుగ ప్రేమ, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. క్రిస్మస్కేవలం సంబరాల పండుగ మాత్రమే కాకుండా బాధ్యతను గుర్తు చేసే సందర్భమని పేర్కొన్నారు. ప్రతి మనిషిలో మానవత్వాన్ని పెంపొందించే సందేశమే క్రిస్మస్అని, అది సార్వత్రిక విలువలతో నిండి ఉందని తెలిపారు. క్రిస్మస్నుంచి వచ్చే క్రిస్మస్వరకు అందరి జీవితాల్లో ఆనందం, శాంతి నిరంతరం నిలవాలని ఆకాంక్షించారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్క్యారల్స్, సంగీత కార్యక్రమాలు, స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శాంటా తాతలు విద్యార్థులకు గిఫ్ట్లు అందజేసి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశారు. రిజిస్ట్రార్ప్రొ. ఎం. పోతరాజు, ఏఐఎంఎస్ఆర్డీన్డాక్టర్అల్ఫ్రెడ్జె అగస్టీన్, యూనిట్హెడ్ఎస్. బాలరాజ్, అధ్యాపకులు, యూనివర్సిటీ అధికారులు వేడుకల్లో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఆనందం, ఐక్యత, స్నేహభావాల మధ్య ప్రీక్రిస్మస్వేడుకలు ఆనందంగా ముగిశాయి. ——————————– డైరెక్టరేట్ఆఫ్ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు