Enquire Now
Enquire Apply

అపోలోలో ఘనంగా ఫిజియోథెరపీ గ్రాడ్యుయేషన్‌ డే

పత్రికా ప్రకటన ఎఐఎంఎస్ఆర్, చిత్తూరు తేదీ: 01 డిసెంబర్2025 అపోలోలో ఘనంగా ఫిజియోథెరపీ గ్రాడ్యుయేషన్‌ డే చిత్తూరు, డిసెంబర్01: అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(ఎఐఎంఎస్ఆర్) పరిధిలోని కాలేజ్ఆఫ్ ఫిజియోథెరపీ నిర్వహించిన 2020 బ్యాచ్గ్రాడ్యుయేషన్డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విద్యా ప్రమాణాల్లో నూతనోత్సాహాన్ని నెలకొల్పుతూ, వరుసగా వంద శాతం ఫలితాలు సాధిస్తూ, మెరుగైన ప్లేస్మెంట్లు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కళాశాల నుంచి మరో బ్యాచ్విజయవంతంగా పట్టాలు అందుకోవడంతో, మొత్తం క్యాంపస్ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ఛాన్సలర్డాక్టర్హెచ్. వినోద్భట్మాట్లాడుతూఫిజియోథెరపీ పుట్టుక నుంచి జీవనాంతం వరకు ప్రతి దశలో కీలక పాత్ర పోషించే గొప్ప వైద్య రంగం. ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపిస్ట్లకు అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. డిగ్రీతో ఆగిపోకుండా స్పెషలైజేషన్లలో ముందుకు సాగుతూ తల్లిదండ్రులుసంస్థ పేరు, గౌరవం నిలబెట్టాలిఅని అన్నారు. ప్రిన్సిపాల్డాక్టర్వి. కిరణ్ మాట్లాడుతూఫిజియోథెరపీ మనిషి జీవితంలోని ప్రతి దశకు అవసరమైన వైద్యసేవ. విద్యార్థులు తమ జ్ఞానం, నైపుణ్యాన్ని సేవాభావంతో సమాజానికి అందించాలిఅని కోరారు. ఏడాది విద్యార్థులంతా తమ ఇంటర్న్షిప్లను విజయవంతంగా పూర్తి చేసి గ్రాడ్యుయేషన్కు అర్హులయ్యారని, ఇప్పటి వరకు మూడు బ్యాచ్లు వరుసగా వంద శాతం ఫలితాలు సాధించడం కళాశాల ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి చేర్చిందని పేర్కొన్నారు. ప్లేస్మెంట్లలోనూ కాలేజ్నిరంతర పురోగతి కొనసాగిస్తోంది. సంవత్సరం పలువురు విద్యార్థులు అపోలో ఆసుపత్రులలోనే నియామకాలు పొందగా, మరికొందరు ఇతర ప్రముఖ వైద్య సంస్థల్లో ఉద్యోగాలు సాధించారని డా. కిరణ్తెలిపారు. కార్యక్రమంలో ఎఐఎంఎస్ఆర్డీన్డాక్టర్అల్ఫ్రెడ్జె. ఆగస్టిన్, రిజిస్ట్రార్ప్రొఫెసర్ఎం. పోతరాజు, అసోసియేట్డీన్డాక్టర్రమ్యా రామకృష్ణన్, స్కూల్ఆఫ్హెల్త్సైన్సెస్డీన్ప్రొఫెసర్కె. భాస్కర్రెడ్డి పాల్గొని గ్రాడ్యుయేట్లను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. —————————– డైరెక్టరేట్ఆఫ్ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనివర్శిటీAIMSR, చిత్తూరు.