వైద్య రంగంలో ఫిజీషియన్ అసిస్టెంట్ల సేవలు కీలకం
పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు – తేదీ: 08-10-2025 వైద్య రంగంలో ఫిజీషియన్ అసిస్టెంట్ల సేవలు కీలకం – AIMSR డీన్ డా. అల్ప్రెడ్ జె. అగస్టిన్ చిత్తూరు, అక్టోబర్ 8: ఆరోగ్యరంగంలో ఫిజీషియన్ అసిస్టెంట్లు అందిస్తున్న అహర్నిశ సేవలు, వైద్య వ్యవస్థలో వారి ముఖ్యపాత్రను గుర్తిస్తూ, జాతీయ ఫిజీషియన్ అసిస్టెంట్ డే – 2025ను ది అపోలో యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి AIMSR డీన్ డా. అల్ప్రెడ్ జె. అగస్టిన్, అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పొతరాజు అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ అసిస్టెంట్స్ (IAPA) అధ్యక్షురాలు, రైట్ రీసెర్చ్ అకాడమీ డైరెక్టర్ గోమతి సుందర్, చెన్నై అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ అలైడ్ సైన్సెస్ డీన్, హెడ్ ప్రొఫెసర్ డి. జగదీశ్వరన్ పాల్గొన్నారు. డా. అల్ప్రెడ్ జె. అగస్టిన్ మాట్లాడుతూ, ఫిజీషియన్ అసిస్టెంట్లు రోగులు, డాక్టర్ల మధ్య కీలకమైన బ్రిడ్జ్ పాత్ర పోషిస్తున్నారని, వారు పేషంట్ల సమస్యలను సక్రమంగా అర్థం చేసుకుని, తగిన వైద్య సేవలను అందించడంలో ప్రధాన భాగస్వాములు అని తెలిపారు. వారు కేవలం సహాయక సిబ్బంది మాత్రమే కాదని, భవిష్యత్తులో రోగుల భద్రత,, వైద్య సేవల నాణ్యతను మెరుగుపరిచడంలో, అలాగే డాక్టర్లపై పని ఒత్తిడిని తగ్గించడంలో ఫిజీషియన్ అసిస్టెంట్ల పాత్ర మరింత ప్రాముఖ్యంగా ఉంటుందని డా. అగస్టిన్ పేర్కొన్నారు. దేశంలో మొదటి పిజిషియన్ అసిస్టెంట్ అయిన గోమతి సుందర్ మాట్లాడుతూ, ఫిజీషియన్ అసిస్టెంట్ల (PAs) చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు, ప్రొఫెషనల్ అభివృద్ధి అవకాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రధాన అతిథులు కేక్ కట్టింగ్ చేసి, ఫిజీషియన్ అసిస్టెంట్ విద్యార్థులు, అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో విద్యార్థులు పోస్టర్ ప్రెజెంటేషన్లు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించి తమ విజ్ఞానాన్ని, సృజనాత్మకతను ప్రదర్శించారు. అదేవిధంగా, విద్యార్థులు స్టాండ్–అప్ టాలెంట్ షోలో వివిధ ప్రదర్శనలు చేసి తమ ప్రతిభను చూపారు. కార్యక్రమం ముగిసిన తరువాత, ఉత్తమ పోస్టర్, టాలెంట్ షో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. భాస్కర్ రెడ్డి, హెచ్వోడి డా. సుచరిత్ పి., డా. దినేశ్ కన్నా, డా. వాణి, స్వీట్లైన్ సోఫియా ఆర్, ఇతర డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.