Enquire Now
Enquire Apply

ప్రపంచ భద్రతా సవాళ్లపై విద్యార్థుల చర్చ

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు తేదీః 25 అక్టోబర్2025 ప్రపంచ భద్రతా సవాళ్లపై విద్యార్థుల చర్చ అపోలో యూనిర్శిటీలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం చిత్తూరు, అక్టోబర్25: యువతలో అంతర్జాతీయ దౌత్య దృక్పథం, చర్చా నైపుణ్యం, ప్రపంచ శాంతి పట్ల అవగాహన పెంచే ప్రయత్నంగా ది అపోలో యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా మోడల్యునైటెడ్నేషన్స్క్లబ్ఆధ్వర్యంలోఅంతర్జాతీయ భద్రతా మండలి సమావేశంశైలిలో మాక్సిమ్యులేషన్నిర్వహించి, సైబర్దాడులు, యుద్ధ ముప్పులు, మానవతా సవాళ్లు వంటి అంశాలపై విద్యార్థులు లోతైన చర్చలు జరిపారు. కార్యక్రమం శనివారం క్యాంపస్లోని డాక్టర్ప్రతాప్సి రెడ్డి నాల్డెజ్సెంటర్ఆడిటోరియంలో జరిగింది. యునైటెడ్నేషన్స్సభ్య దేశాల ప్రతినిధులుగా విద్యార్థులు వ్యవహరిస్తూ, అంతర్జాతీయ భద్రత, సైబర్యుద్ధం, దేశాల పరస్పర సహకారం వంటి అంశాలపై అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ప్రతి ప్రతినిధి తన దేశం తరఫున వాదనలు, ప్రతివాదాలు చేస్తూ దౌత్య చాతుర్యాన్ని చాటారు. కార్యక్రమానికి ది అపోలో యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్. సేతురామ సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ స్థాయి సమస్యలపై విద్యార్థులు లోతుగా ఆలోచించి, సమగ్ర పరిష్కారాలపై చర్చించడం భవిష్యత్తు నాయకత్వ లక్షణాలకు పునాది వేస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విశ్లేషణా దృష్టిని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన అజెండాగా — “నాటో సభ్య దేశాలపై జరుగుతున్న సైబర్దాడులు, మిశ్రమ యుద్ధ పద్ధతులు, సైనిక ముప్పుల నేపథ్యంలో వ్యూహాత్మక, మానవతా మరియు భద్రతా ప్రతిస్పందనలపై చర్చలుఅనే అంశాన్ని ఎంచుకుంది. నేపథ్యంలో విద్యార్థులు నేటి ప్రపంచానికి సంబంధించిన అత్యంత ప్రాధాన్యత గల అంశాలపై ఆలోచనాత్మక చర్చలు జరిపారు. చర్చల ముగింపులో ఉత్తమ ప్రతినిధులుగా ఎంపికైన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎంఎస్ఆర్డీన్డాక్టర్అల్ఫ్రెడ్జె అగస్ట్రిన్, అపోలో మోడల్యునైటెడ్నేషన్స్క్లబ్ఫ్యాకల్టీ కోఆర్డినేటర్డాక్టర్సుధా .పి, డాక్టర్ షాని ఎస్.ఎస్, క్లబ్సభ్యులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ————————————— డైరెక్టరేట్ఆఫ్ప్రెస్అండ్పబ్లికేషన్స్, ది అపోలో యూనిర్శిటీ, చిత్తూరు.