Enquire Now
Enquire Apply

ఘనంగా ముగిసిన అపోలో స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు

పత్రికా ప్రకటన అపోలో నాలెడ్జ్ సిటీ, చిత్తూరు తేదీ: 04 అక్టోబర్‌ 2025 ఘనంగా ముగిసిన అపోలో స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు పది రోజుల పాటు కొనసాగిన ప్రత్యేక క్లీన్లీనెస్ క్యాంపెయిన్‌ స్వచ్ఛత అంటే శుభ్రత మాత్రమే కాదు – జీవన విలువ అని చాటిన విద్యార్థులు చిత్తూరు, అక్టోబర్‌ 4: చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్‌ సిటీలో పది రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛతే సేవా ప్రత్యేక క్యాంపెయిన్‌ శనివారం ఘనంగా ముగిసింది. ది అపోలో యూనివర్శిటీ, అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (AIMSR), అపోలో కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా డా. ప్రసాద్‌ సి. రెడ్డి నాలెడ్జ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది అపోలో యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ – “పది రోజుల పాటు క్యాంపస్‌ అంతటా జరిగిన స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు సమగ్రత, విజిబిలిటీతో చాలా బాగా జరిగాయి. పర్యావరణం పట్ల మనం చూపించే శ్రద్ధకు ప్రతిస్పందనగా ప్రకృతీ అదే విధంగా మనపై ప్రభావం చూపుతుంది. స్వచ్ఛతే సేవా కార్యక్రమం ఒక్క సంవత్సరం కార్యక్రమం కాకుండా, ప్రతిరోజూ మన జీవిత భాగంగా మారాలి,” అని పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌ ప్రొ. ఎం. పోతరాజు మరియు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ల మార్గదర్శకత్వంలో సెప్టెంబర్‌ 24 నుండి అక్టోబర్‌ 3 వరకు సాగిన ఈ క్యాంపెయిన్‌లో హాస్టల్‌ క్లీన్‌లీనెస్‌ వీక్‌, డిజిటల్‌ క్లీన్‌ డ్రైవ్‌, వీడ్‌ కలెక్షన్‌, ప్లాంటేషన్‌ డ్రైవ్‌, క్లీన్‌ గ్రీన్‌ ఉత్సవ్‌, హౌస్‌ కీపింగ్‌ సిబ్బందికి హెల్త్‌ చెకప్స్‌, ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా డ్రైవ్‌ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. డ్రామా క్లబ్‌ విద్యార్థులు ప్రదర్శించిన “స్వచ్ఛత – ప్రతి ఒక్కరి బాధ్యత” అనే స్కిట్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ది అపోలో యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ప్రొ. ఎం. పోతరాజు, ఎఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డా. అల్ఫ్రెడ్‌ జె. అగస్టిన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్లు హేంమాద్రి రెడ్డి, గాయత్రి, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ————————— డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్స్‌, ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు.