Enquire Now
Enquire Apply

అపోలో యూనిర్శిటీలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు తేదీ: 09-10-2025 అపోలో యూనిర్శిటీలో ప్రపంచ దృష్టి దినోత్సవం చిత్తూరు, అక్టోబర్ 9: ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ది అపోలో యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోని ఆలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం, ఆప్టోమెట్రీ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలోబైనాక్యులర్ విజన్ & లో విజన్పై హ్యాండ్స్ఆన్ వర్క్షాప్గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ది అపోలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా. హెచ్. వినోద్భట్, ఏఐఎంఎస్ఆర్డీన్డా. అల్ఫ్రెడ్జె. అగస్టిన్, హెల్త్ సైన్సెస్ స్కూల్ డీన్ ప్రొ. కె. భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా వీసీ డా. హెచ్. వినోద్భట్ మాట్లాడుతూప్రపంచ దృష్టి దినోత్సవం మనందరికీ కంటి ఆరోగ్య ప్రాముఖ్యతను గుర్తు చేసే రోజు. చూపు అనేది మనిషికి లభించిన అత్యంత విలువైన వరం. గతంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కంటి వైద్యం, కంటి పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టేవి. అప్పట్లో క్యాటరాక్ట్ బ్లైండ్నెస్ భారతదేశంలో ప్రధాన సవాలుగా నిలిచింది. ఇప్పుడు పరిస్థితి మారిందిఆధునిక వైద్య సాంకేతికత, కంటి పరికరాలు, డిజిటల్ డయగ్నోస్టిక్స్ అందుబాటులోకి రావడంతో కంటి సంరక్షణ మరింత సులభమైందని పేర్కొన్నారు. కంటి వైద్యులు, ఆప్టోమెట్రిస్టులు వ్యక్తిగత వైద్య సేవలకే పరిమితం కాకుండా సమాజ ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషించాలి అని కోరారు. వర్క్షాప్లో కీ రీసోర్స్పర్సన్స్గా న్యూరాసిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మరియు విజిటింగ్ ప్రొఫెసర్ డా. ఎస్.వి. రమేష్, ఆప్టో రీసెర్చ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ & ఆప్టో రీసెర్చ్ అకాడమీ వ్యవస్థాపకుడు డా. గోపీనాథ్ మాదేశ్వరన్ పాల్గొన్నారు. ఇద్దరు నిపుణులు తమ విస్తృత అనుభవంతో బైనాక్యులర్ విజన్, లో విజన్ రిహాబిలిటేషన్, ఆధునిక ఆప్టోమెట్రిక్ టెక్నాలజీలు, పేషెంట్ అసెస్మెంట్ పద్ధతులపై సవివర ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డా. రామయ్య ఇటుమల్ల, ఎఐఎంఎస్ఆర్ఆఫ్థాల్మాలజీ హెడ్ డా. ఆశ్వత్కుమార్, ఆలైడ్ హెల్త్ సైన్సెస్ హెచ్ఓడి డా. సుచరిత పి, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. వర్క్షాప్ను ఆప్టోమెట్రీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్రాకేష్ కుమార్ యాదవ్ సమన్వయం చేశారు. ———————– డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనిర్శిటీ, చిత్తూరు.